అల్లాదుర్గం, జనవరి 7 : మండలంలోని ప్రతి గ్రామంలో వారం రోజుల్లో క్రీడా మైదానాలను నిర్మించాలని అధికారులను జడ్పీ డిప్యూటీ సీఈవో సుభాషిణి ఆదేశించారు. శనివారం అల్లాదుర్గం మండల పరిషత్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించి, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ క్రీడా మైదానాల పనుల్లో జాప్యం జరగడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, కల్టెకర్ ఆదేశాలతో ఇక్కడికి వచ్చినట్లు తెలిపా రు. ప్రతి గ్రామంలో స్థలాలు సేకరించినా.. క్రీడా మైదానాలను ఎం దుకు నిర్మించడం లేదని? ప్రశ్నించారు.
స్థలాల ఎంపికపై వివాదం ఉంటే రెవెన్యూ అధికారులతో మాట్లాడాలన్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో బృహత్తర పల్లె ప్రకృతివనం పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే వర్షాకాలం నాటికి హరితహారంపై కార్యాచరణ చేపట్టాలని సూచించారు. స్థలాలు లేకపోవడంతో క్రీడా మైదానాల నిర్మాణంలో ఆలస్యం అవుతున్నదని, త్వరలోనే పనులను చేపడు తామని ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సూపరింటెండెంట్ ఏసురత్నం, అల్లాదుర్గం సూపరింటెండెం ట్ శంకర్, ఎంపీవో సయ్యద్, కార్యదర్శులు పాల్గొన్నారు.