గెలుపే లక్ష్యం కావాలి
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, పట్టణాధ్యక్షుడు గజవాడ నాగరాజు అన్నారు.
- మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్
- రామాయపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం
- పద్మాదేవేందర్‌రెడ్డికి భారీ మెజార్టీ ఖాయం
- మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు
రామాయంపేట/ చిలిపిచెడ్/ కొల్చారం/ చేగుంట, నవంబర్ 1 : బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, పట్టణాధ్యక్షుడు గజవాడ నాగరాజు అన్నారు. బుధవారం రామాయంపేట శివారులోని డబుల్బెడ్రూమ్ కేసీఆర్ కాలనీ వద్ద బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్ కాలనీ సంఘం కమిటీ చైర్మన్ ప్రభాకర్ అధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు హాజరై మా ఓటు పద్మక్కకే, మా ఆడబిడ్డ పద్మక్కను మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తామన్నారు. ఇండ్లులేని మాకు ఇండ్లిచ్చి ఆదుకున్న బీఆర్ఎస్ను మరువమని, మా ఎమ్మెల్యే పద్మక్కకే కేసీఆర్ కాలనీలో స్థానం ఉంటుందని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్ మాట్లాడుతూ పద్మక్కను గెలిపిస్తే కేసీఆర్ కాలనీలో రోడ్లు, కమ్యూనిటీ హాళ్లను నిర్మించుకునే అవకాశం ఉంటుందప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పద్మాదేవేందర్‌రెడ్డిని మంత్రిగా చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ కాలనీవాసులు పద్మాదేవేం దర్‌రెడ్డికి భారీ మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని కోరారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, కౌన్సిలర్లు గంగాధర్, అనిల్, సుందర్‌సింగ్, నాయకులు చంద్రపు కొండల్‌రెడ్డి, చింతల యాదగిరి, దేవుని రాజు, సరాఫ్ శ్యాంసుందర్, కో ఆప్షన్ సభ్యుడు బాలుగౌడ్, కేసీఆర్ కాలనీ వాసులు చంద్రం, ఎల్లాగౌడ్, నగేశ్, పోచయ్య, రమేశ్, సిద్ధ్దు, దేవుని శ్రీనివాస్, రవి, రాములు, నర్సింహులు, మ్యాదరి స్వామి, అనిల్, అరుణ్, శ్రీకాంత్, కమ్మరి శ్రీను, యాదేశ్, నర్సింహులు, రమేశ్, గొం గళ్ల వెంకన్న, బాలమణి, రామదాసు, స్వామి, ఇమ్రాన్, షాదుల్, బాబుమియ, చాంద్‌పాషా, యాదగిరి ఉన్నారు.
ఎంపీపై దాడి బాధాకరం
- * బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్‌రెడ్డి
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేయడం బాధాకరం… ఎంపీ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ చిలిపిచెడ్ మండలాధ్యక్షుడు అశోక్‌రెడ్డి తెలిపారు. చిలిపిచెడ్‌లో అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో గెలవలేని వ్యక్తులు భౌతికదాడులను ప్రోత్సాహిస్తారన్నారు. రెండుసార్లు మెదక్ ఎంపీగా గెలిచిన ప్రభాకర్‌రెడ్డికి దుబ్బాక లో పెరుగుతున్న ప్రజాబలం చూసి ఓర్వలేక కత్తి దాడులకు పాల్పడడం బాధాకరమని అశోక్‌రెడ్డి అన్నారు.
నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేసి సునీతారెడ్డిని గెలిపించాలని కోరారు.
నేడు చేగుంటకు మంత్రి హరీశ్‌రావు రాక
చేగుంట మండల కేంద్రానికి గురువారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు వస్తున్నట్లు బీఆర్ఎస్ కమిటీ సభ్యులు బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు.
నేడు కొల్చారం మండలంలో ప్రచారం
కొల్చారం మండలంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గౌరీశంకర్గుప్త్తా తెలిపారు. కొంగోడు, నాయిన్ జలాల్పూర్, పోతిరెడ్డిపల్లి, అంసాన్పల్లి, వాసురాం తండా, వెంకటాపూర్, పోతంశెట్‌పల్లి, అప్పాజిపల్లి గ్రామాల్లో సునీతారెడ్డితో పాటు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు.
ప్రభాకర్‌రెడ్డి త్వరగా కొలుకోవాలి
- * బంగారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి త్వరగా కొలుకోవాలని చేగుంట మండలంలోని కాళ్లకల్ బంగారమ్మ ఆలయంలో నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఇబ్రహీంపూర్ సర్పంచ్ రాములు, సొసైటీ డైరెక్టర్ సిద్ధిరాములు, నాయకులు చందంపేట బాలశివయ్య, ఆలం శ్రీకాంత్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

