వెల్దుర్తి, జనవరి 23 : అంధత్వ నివారణ కోసం తెలంగా ణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. సోమవారం వెల్దుర్తితో పాటు మండలంలోని మన్నెవారి జలాల్పూర్ గ్రామా ల్లో నిర్వహిస్తున్న కంటివెలుగు కేంద్రాలను ఎమ్మెల్యే సందర్శించారు. కేంద్రాల వద్ద కల్పించిన మౌలిక వసతులు, పరీక్షలు నిర్వహిస్తున్న తీరును, కంటి అద్దాల పంపిణీ గురించి సంబంధిత వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పరీక్షల కోసం వచ్చిన గ్రామస్తులతో మాట్లాడి ఎమ్మెల్యే కంటివెలుగు ప్రాముఖ్యతను వారికి వివరించి, ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
కల్యాణలక్ష్మీతో పేదలకు వరం
మండలంలోని పలు గ్రామాలకు చెందిన 31మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కో-ఆప్షన్ మన్సూర్, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, సర్పంచ్ భాగ్యమ్మ ఆంజనేయులు, ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ, తహసీల్దార్ సురేశ్‌కుమార్, డాక్ట ర్లు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, ఏఎం సీ డైరెక్టర్ రమేశ్చందర్, నాయకులు పాల్గొన్నారు.
కోనాపూర్‌లో శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీపీ
రామాయంపేట, జనవరి 23 : కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, సర్పంచ్ దోమ చంద్రకళ అన్నారు. సోమవా రం మండలంలోని కోనాపూర్ గ్రా మంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించి సర్పంచ్ చంద్రకళకు ఎంపీపీ అద్దాలను అందజేశారు.
కంటి వెలుగు పకడ్బందీగా..
కొల్చారం, జనవరి 23: కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ పకడ్బందీగా నిర్వహిస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఏటిగడ్డ మాందాపూర్‌లో సోమవారం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వెంకటాపూర్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
మెదక్ రూరల్, జనవరి 23 : ప్రభుత్వం చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో శ్రీరాములు అన్నారు. సోమవారం మండలంలోని జానకంపల్లిలో ఏర్పాట్లను పరిశీలించారు.
క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి
శివ్వంపేట, జనవరి 23 : కంటివెలుగు క్యాంపును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. సోమవారం శివ్వంపేటలో కంటివెలుగు క్యాంపు ను పరిశీలించి డాక్టర్లతో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీటీసీ పబ్బమహేశ్గు ప్తా, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైడి శ్రీధర్‌గుప్తా ఉన్నారు.
పేదల కోసమే ‘కంటి వెలుగు’
అల్లాదుర్గం, డిసెంబర్ 23: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం మండలంలోని గొల్లకుంట తండాలో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించా రు. వైద్య సిబ్బందితో మాట్లాడి కంటివెలుగుతో అందించే అద్దాలు, మందులు,పరీక్షించే విధానంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.