రేగోడ్,మే 02 : రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ దత్తారెడ్డి అన్నారు. రేగోడ్ పీఏసీఎస్‌లో శుక్రవారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళారులను ఆశ్రయించి మోసపోవద్దని రైతులకు సూచించారు.
ఒక క్వింటాల్7 జొన్నలకు రూ.3,371 మద్దతు ధర ప్రకటించారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో సీతారావమ్మ, ఏవో జావీద్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ రాజు యాదవ్, శ్యాంరావు కులకర్ణి, ఆర్ఐ ఫిరోజ్, మాజీ జడ్పీటిసీ యాదగిరి, ఏఎస్ఐ మల్లయ్య, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మణ్ రాధాకిషన్ పాల్లొన్నారు.