సంగారెడ్డి, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): వర్షాలకు జలవనరులు కళకళలాడుతున్నాయి. వరద వస్తుండడంతో సిం గూరు ప్రాజెక్టు నీటిమట్టం 25.894 టీఎంసీలకు చేరుకుం ది. వరద ఇలాగే కొనసాగితే ఈ ప్రాజెక్టు నిండే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా, మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటున్నది. వారం క్రితం వరకు ప్రాజెక్టు నీటిమట్టం 14.612 టీఎంసీలు ఉండే, వర్షాకాలంలో సైతం ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో రైతుల్లో ఆందోళన చెం దారు.
ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రా జెక్టులోకి భారీగా వరద వస్తున్నది. బుధవారం ప్రాజెక్టులోకి 46,604 క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో ప్రాజె క్టు నీటిమట్టం 25.420 టీఎంసీలకు చేరుకుంది. సింగూ రు ప్రాజెక్టు నిండితే సాగు, తాగునీటి కష్టాలు తీరనున్నా యి. జిల్లాలోని మరో ప్రాజెక్టు నల్లవాగు అలుగు పారుతోం ది. నల్లవాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 0.746 టీఎంసీ కాగా, ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగు పారుతోంది.
వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. జిల్లాలో బుధవారం 2.8 సెం.మీట ర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. సంగారెడ్డిలో అత్యధికంగా 6.5 సెం.మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని 12 మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షం కురవగా 13 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాలతో జిల్లాలోని చెరువులు కుంటలు నిండుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 1769 చెరువులు ఉండగా, 147 చెరువులు మత్తడి దూకుతున్నాయి. 373 చెరువులు పూర్తి గా నిండాయి. 309 చెరువులు 75 శాతం నీటితో నిండగా 820 చెరువులు 50 శాతం నీటితో నిండాయి. వర్షాలు మరి కొన్ని రోజులు కొనసాగితే జిల్లాలోని చెరువులు పూర్తి గా నీటితో నిండనున్నాయి.