పుల్కల్, మే 29: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలపరిధిలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు నుంచి బుధవారం మంజీరా బ్యారేజ్‌కు నీటి పారుదల శాఖ అధికారులు తాగునీటిని విడుదల చేశారు. వేసవి దృష్ట్యా మంజీరా పరీవాహక ప్రాంతాల ప్రజలకు తాగు నీరందించేందుకు జల విద్యుత్ కేంద్రం నుంచి 1460(0.30) టీఎంసీల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈ మహిపాల్ రెడ్డి విలేకరులతో తెలిపారు. ప్రాజెక్టు నుంచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేసిన సందర్భంగా నది పరీవాహక ప్రాంతా ల ప్రజలు, గొర్లకాపరులు, మత్స్యకారులు అటు వైపునకు వెళ్లకూడదని హెచ్చరించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29. 917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 14.740 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.