రామాయంపేట, మే 07 : ఓ మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన రామాయంపేట పట్టణంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని బీసీ కాలనీ రోడ్డులో అద్దెకు ఉంటున్న ఒంటరి మహిళ పుష్ప(40) కూలీ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తుంది. అద్దె ఇంట్లో ఉంటున్న మహిళ తెల్లవారు జామున తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆమె అరుపులు విని చట్టుపక్కల వారు.
పోలీసులకు సమాచారం చేరవేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు 108 అంబులెన్సులో రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు చికిత్సల నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం గాంధీ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.