అక్కన్నపేట, ఏప్రిల్ 15 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అక్కన్నపేట మండలం కుందన్‌వానిపల్లి గ్రామ పరిధిలోని చౌటకుంటతండాకు చెందిన మాలోతు దేవేందర్(31) అనే యువకుడు ప్రమాదావశాత్తు విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం..దేవేందర్ గురువారం రాత్రి ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్లోని ఫ్యాన్ రిపేర్ చేస్తుండగా ప్రమాదావశాత్తు విద్యుత్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడికి భార్య కవిత, ముగ్గురు పిల్లలున్నారు. కాగా, అప్పటిదాక అందరితో కలివిడిగా ఉన్న దేవేందర్ ఇంటికి వెళ్లి విద్యుత్‌షాక్‌తో మృతి చెందడం పట్ల తండావాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి తండ్రి స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు. కాగా, దేవేందర్ మృతితో తండాలో విషాదం నెలకొంది.