BRS party | 1000 రోజులు గడిచినా.. ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలు ఎక్కడ.. ?
BRS Party | ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, ప్రస్తుతం జరుగుతున్న అమలుకు పొంతన లేదని తొగుట బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిరంతరం నిలదీస్తామని స్పష్టం చేశారు.
BRS party | తొగుట : ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దాదాపు వెయ్యి రోజులు గడుస్తున్నా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తొగుటలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జీడిపల్లి రాంరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాటలను విస్మరించిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను ప్రజల ముందు పెట్టి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. వెయ్యి రోజులు దాటుతున్నా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయకపోవడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హామీల అమలును ప్రశ్నిస్తూ జాబ్ కార్డులను ప్రదర్శించి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లారు.
సొసైటీ చైర్మన్ కె హరికృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, ప్రస్తుతం జరుగుతున్న అమలుకు పొంతన లేదని ఆరోపించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిరంతరం నిలదీస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలకు పూర్తి సమాధానం చెప్పే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిద్దిపేటకు ఆటోలో వెళ్తున్న మహిళ బీఆర్ఎస్ ఆందోళన చూసి ఆటో దిగి వొచ్చి రేవంత్ మోసాలపై తూర్పార పట్టారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బక్క కనకయ్య, నాయకులు చిలువేరి మల్లారెడ్డి, దోమల కొమురయ్య, సుతారి రమేష్, బోధనం కనకయ్య, మంగ నర్సింలు, నంట పరమేశ్వర్ రెడ్డి, బండారు స్వామి గౌడ్, కుర్మ యాదగిరి, అరుణ్ కుమార్, ఎల్లం, వెంకట్ రెడ్డి, అశోక్, బోయిని శ్రీనివాస్, బిక్షపతి, నరేందర్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రమేష్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్,రాములు, యాదగిరి, ప్రకాష్, సంతోష్, స్వామి, నర్సింలు గౌడ్, కిషన్, భాస్కర్, నాగరాజు, రమేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

