Ayushman Bharat Cards | హుస్నాబాద్ టౌన్, జూలై 16 : రహదారులపై చెత్తను సేకరించే వారికి ప్రభుత్వం ద్వారా అయుష్మాన్ భారత్ కార్డులను అందజేస్తామని మున్సిపల్ కమిషనర్ తాటి మల్లికార్జున్‌గౌడ్ చెప్పారు.
నమస్తే స్కీం కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో చెత్తను సేకరించే వారితో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మల్లికార్జున్‌గౌడ్ మాట్లాడుతూ.. అట్టముక్కలు, కవర్లు, ప్లాస్టిక్ వస్తువులతోపాటు పనికిరాని పొడిచెత్తను స్థానిక డీఆర్సీసీలో తీసుకోవడం జరుగుతుందని వారికి వివరించారు.
అనంతరం చెత్తసేకరించే ఆరుగురు సభ్యులను నమస్తే స్కీంలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, పర్యావరణఅధికారి డి.రవికుమార్, మెప్మా ఆర్పీ పద్మతదితరులు ఉన్నారు.
Prada | చెప్పుల ప్రదర్శనతో వివాదం వేళ.. కొల్హాపూర్‌ని సందర్శించిన ప్రాడా ప్రతినిధుల బృందం
Viral video | లిఫ్టులో గ్యాంగ్ వార్.. తప్పతాగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు.. చెంపదెబ్బలు..!
KCR | ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మృతిపట్ల కేసీఆర్ సంతాపం