రాయపోల్ : నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి ( MEO Satyanarayana reddy ) అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండలంలోని రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. సందర్భంగా ఎంఈవో చాచా నెహ్రూ( Nehru) వేషాధారణలో మాట్లాడారు.
దేశ భవిష్యత్తులో విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. విద్యార్థులు మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని, తల్లిదండ్రుల కన్న కలలను నెరవేర్చాలని సూచించారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే పట్టుదలతో పనిచేయాలని తెలిపారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.