Rayapole | పర్యావరణ పరిరక్షణకు నిలువెత్తు నిదర్శనం రాంసాగర్..!
రాయపోల్, సెప్టెంబర్ 19: సంప్రదాయ మట్టి గణపతిని ప్రతిష్టించిన రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామ ప్రజలను శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అభినందించారు.
రాయపోల్, సెప్టెంబర్ 19: వినాయక చవితి పర్వదినాన్ని పునస్కరించుకొని సంప్రదాయ మట్టి గణపతిని ప్రతిష్టించిన రాంసాగర్ గ్రామ ప్రజలను శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అభినందించారు. హానికరమైన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయనాలతో తయారైన విగ్రహాలకు స్వస్తి పలికి, పర్యావరణ పరిరక్షణకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆ గ్రామ మట్టి గణపతి కమిటీని శనివారం ఆయన ఘనంగా సన్మానించారు.
శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు మాట్లాడుతూ.. నేటి తరానికి భక్తితో పాటు బాధ్యత కూడా అవసరమని అన్నారు. మట్టి గణపతిని పూజించడమే నిజమైన పర్యావరణ పరిరక్షణ అని ఆయన తెలిపారు. 22 ఏళ్లుగా మట్టి గణపతి ఉద్యమాన్ని భుజానికెత్తుకుని లక్షలాది మందిలో చైతన్యం నింపుతున్నామని, ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని ఈ సందర్భంగా రామరాజు వెల్లడించారు.

రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో మట్టి గణపతే కొలువుదీరాలని ఆయన ఆకాంక్షించారు. మట్టి గణపతి ఉద్యమాన్ని ఉద్యమంలా ప్రతి పల్లెకు తీసుకెళ్తున్న రామకోటి రామరాజు సేవలు చిరస్మరణీయమని గ్రామస్తులు, భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో దేవాలయం అధ్యక్షులు ఏమిశెట్టి వెంకటేష్, మాజీ సర్పంచ్ ఆదిరెడ్డి, మెట్టయ్య, రుక్మయ్య, గణేష్, వెంకట్ గౌడ్, నర్సింలు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

