Rayapol MPDO | రాయపోల్, సెప్టెంబర్ 03 : రాయపోల్ మండల ఇంచార్జ్ ఎంపీడీవోగా బుధవారం సోమిరెడ్డి బాధ్యతలను స్వీకరించారు. గత రెండు సంవత్సరాలు ఎంపీడీవోగా ఇక్కడ విధులు నిర్వహించిన బాలయ్య ఇటీవలే రాయపోల్ మండల కేంద్రంలో పదవీ విరమణ చేశారు. అయితే చిన్నకోడూరు ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్న సోమిరెడ్డి రాయపోల్ ఇంచార్జ్ ఎంపీడీవోగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ ఎంపీడీవో సోమిరెడ్డికి కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు.
ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. అందరి సహకారంతో గ్రామాల అభివృద్ధితో పాటు మండల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని..ప్రత్యేకంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండి పరిష్కరించాలని సూచించారు.
కొత్తగా ఏర్పడిన మండలం కావడం వలన సమస్యలు ఉంటాయని.. అయినప్పటికీ వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలని ఆయన సూచించారు. సిబ్బంది సహకారం, పంచాయతీ కార్యదర్శుల సహకారంతో గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని ఈ సందర్భంగా ఇంచార్జ్ ఎంపీడీవో సోమిరెడ్డి పేర్కొన్నారు.
RTC Buses | హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
MLA Malla Reddy | తెలంగాణ ప్రజలే కేసీఆర్కు ముఖ్యం : ఎమ్మెల్యే మల్లారెడ్డి
Naxalites | 20 మంది మావోయిస్టులు లొంగుబాటు