అమరావతి : ఏపీ కౌన్సిల్ ( AP Council ) సమావేశాల మూడో రోజు కూడా వైసీపీ సభ్యులు ( YCP members ) నానా హంగామా సృష్టించారు. సభ్యుల అరుపులు, కేకలతో రెండురోజులుగా కౌన్సిల్ సమావేశాలు వాయిదా పడుతున్నాయి. గురువారం కూడా వివిధ అంశాలను ప్రస్తావిస్తూ వాయిదా తీర్మానాలకు పట్టుబట్టారు. వాయిదా తీర్మానాలను మండలి చైర్మన్ మోషేన్రాజుతిరస్కరించారు.
దీంతో సభ్యులు బొమ్మి ఇజ్రాయెల్, రమేశ్ యాదవ్, మొండితోక అరుణ్‌కుమార్ తదితరులు చైర్మన్ పోడియంను ముట్టడించి వెంట తెచ్చుకున్న విజిల్స్ ( Whistles ) వేస్తూ అంతరాయం కల్పించారు. అయితే వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై అధికార పక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభలోకి విజిల్స్ ఎలా తెచ్చారనే అంశంపై అసెంబ్లీ భద్రతా సిబ్బంది ఆరా తీశారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని మంత్రి అచ్చెన్నయుడు అన్నారు. ఈ విషయంలో వైసీపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.