Cellphone Charging | వాట్ ఏ థాట్.. వాట్ ఏ విజన్.. బైక్‌పైనే సెల్‌ఫోన్ ఛార్జింగ్
Cellphone Charging | బైక్‌పై దూరప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఒకవేళ సెల్ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఎలా..? ప్రయాణంతోపాటే బైక్‌తోనే ఛార్జింగ్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది.. అవును సరిగ్గా ఓ యువ రైతుకు ఇలాంటి ఆలోచనే వచ్చింది.
Cellphone Charging | రాయపోల్, ఫిబ్రవరి 19 : ఈ రోజుల్లో ఎక్కడికెళ్లినా సెల్‌ఫోన్ ఖచ్చితంగా దగ్గర ఉండాల్సిందే. సెల్‌ఫోన్ అంత నిత్యవసర వస్తువు అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఆ సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్‌ను సాధారణంగా ఇంట్లో పెట్టుకుంటాం.. లేదంటే పవర్ బ్యాంక్ అయినా వాడుతాం. కానీ బైక్‌పై దూరప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఒకవేళ సెల్ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఎలా..? ప్రయాణంతోపాటే బైక్‌తోనే ఛార్జింగ్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది.. అవును సరిగ్గా ఓ యువ రైతుకు ఇలాంటి ఆలోచనే వచ్చింది. ఇంకేంటి మరి అదే ఆలోచనను ఆచరణలో పెట్టాడు.
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం తిమ్మక్కపల్లి గ్రామానికి చెందిన మచ్చ కరుణాకర్ తన బైక్ ద్వారానే సెల్ ఫోన్ చార్జింగ్ ఏర్పాటు చేసే బాక్స్ ఫిటింగ్ చేసుకున్నాడు. ప్రతీ రోజు ఎక్కడికెళ్లినా బైక్‌పైనే చార్జింగ్ పెట్టుకొని యూట్యూబ్ పాటలు వింటున్నాడు. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేందుకు బైకు ముందు భాగంలో బ్యాటరీ ద్వారా వైరింగ్ ఏర్పాటు చేసి.. సెల్ ఫోన్ చార్జింగ్ ప్లగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. నిత్యం వ్యవసాయ బోరుబావి వద్దకు వెళ్ళినప్పుడు తమకు ఛార్జింగ్ పెట్టేందుకు వీలు లేకపోవడంతో ఇలా తన బైక్‌కే ఫోన్ చార్జింగ్ పెట్టుకుంటున్నట్లు కరుణాకర్ చెబుతున్నాడు.
దూర ప్రయాణాలు చేసినప్పుడు కూడా బైక్ ద్వారా ఫోన్ చార్జింగ్ అవడం వల్ల చార్జింగ్ మాత్రం ఎప్పుడు అయిపోదని.. దీంతో తమకు ఎటు పోయిన బైక్ ద్వారానే సెల్ ఫోన్ చార్జింగ్ అందిస్తుందని పేర్కొన్నాడు. తిమ్మక్కపల్లి గ్రామ యువరైతు బైక్ ద్వారా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేలా చేసిన వినూత్న ఆలోచన అందరినీ ఆకర్షిస్తుంది. కరుణాకర్ ఆలోచనతో ఇంప్రెస్ అవుతున్న చాలా మంది తాము కూడా బైక్ ద్వారా సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. కాగా యువ రైతు కరుణాకర్ చేసిన ఐడియా అందర్నీ ఆకట్టుకుంటుంది.


Read Also :
Congress | కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో ప్రవర్తిస్తున్నది : గండ్ర వెంకటరమణారెడ్డి
Afghanistan | ఎముకలు విరిగితేనే నేరమట.. గృహ హింసను చట్టబద్ధం చేసిన అఫ్గానిస్థాన్..!
‘మహిళల ఆర్థిక సాధికారతకు మహిళా సమాఖ్య సంఘాలు కీలకం’
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

