
చేర్యాల, జూన్ 30: దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యమని, వారి సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఏడేండ్లలో రూ.55వేల కోట్లు ఖర్చు చేశారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు చెందిన దళిత నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. అలాగే, తెలంగాణ తల్లి విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అమరవీరుల స్తూపం వద్ద పువ్వులు చల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1,200కోట్లతో దళిత సాధికారత పథకం రూపొందించారన్నారు. దళితుల సామాజిక, ఆర్థిక బాధలు తొలగించేందుకు దశల వారీగా కార్యాచరణ అమలు చేసేందుకు సర్కారు సిద్ధంగా ఉందన్నారు.
దళితుల అభ్యున్నతి సీఎం కేసీఆర్
సిద్దిపేట అర్బన్/ నారాయణరావుపేట/ చిన్నకోడూరు, జూన్ 30: దళితుల అభ్యున్నతి సీఎం కేసీఆర్ సాధ్యమని సిద్దిపేట రూరల్ మండల దళిత ప్రజాప్రతినిధులు, నారాయణరావుపేట ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ, టీఆర్ మహిళా అధ్యక్షురాలు కొంపెల్లి పద్మ అన్నారు. దళిత సాధికారత పథకంపై హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట రూరల్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట, నారాయణరావుపేట మండల పరిధిలోని జక్కాపూర్ గ్రామంలో సర్పంచ్ మాస శశి, వైస్ ఎంపీపీ సంతోష్ ఆధ్వర్యంలో, చిన్నకోడూరులో ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్, మాజీ ఎంపీపీ నముండ్ల రామచంద్రం, చిన్నకోడూరు మండల దళిత నాయకుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.