హుస్నాబాద్, ఫిబ్రవరి 18 : వైద్యులు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ రజితావెంకట్ అన్నా రు. శుక్రవారం హుస్నాబాద్‌లో డాక్టర్ గాజర్ల దీప్తి నిర్వహించే నారాయణ హోమియో క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. నిరుపేదలైన రోగులు ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి సేవాదృక్పథంతో వైద్యసేవలందించాలని సూచించారు. వైద్యులు లాభాపేక్షతో కాకుండా సేవానిరతితో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో వైస్‌చైర్‌పర్సన్ అనితారెడ్డి, మాజీ ఎంపీపీ వెంకట్, డాక్టర్ వజ్ర, పందిల్ల శంకర్, మల్కిరెడ్డి మోహన్‌రెడ్డి, మహేశ్, మహేందర్, తిరుపతి, భగవాన్, మంచాల రవి, లక్ష్మీపతి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
సిరిసినగండ్లలో ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం
సిరిసినగండ్ల గ్రామంలో కొం డపాక ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ రజనియా ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. సర్పంచ్ గూడెపు లక్ష్మారెడ్డి మా ట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే మందులు ఆయుర్వేదంలో ఉన్నాయన్నారు. ఆయుర్వేద మందుల వాడకం ఆరో గ్యానికి మేలని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు గ్రామస్తుల కు వైద్యపరీక్షలు నిర్వహించి, మందులను అందజేశారు.