గజ్వేల్, ఫిబ్రవరి 13 : మండలంలోని దిలాల్పూర్ గ్రామాన్ని ఆదివారం కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ బృందం సభ్యురాలు అంజలి సందర్శించారు. పల్లె ప్రగతి కింద గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలను పరిశీలించారు. గ్రామంలో ముందు గా ఎస్సీ కాలనీ, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల పరిసరాలు, డంపింగ్‌యార్డు, ఫంక్షన్ హాల్, దేవాలయం, గ్రామ పంచాయతీ, రహదారులు, మురుగు కాల్వలను ఆమె పరిశీలించింది. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ పారిశుధ్యం, పరిశుభ్రత, అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కేంద్ర బృందం సభ్యురాలు అంజలికి సర్పంచ్ దివ్యసుధామ దయాకర్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఆమె వెంట అడిషనల్ డీఆర్డీవో కౌసల్యాదేవి, ఎంపీడీవో రాజేశ్‌కుమార్, ఏపీడీ ఓబులేశ్, ఎంపీవో దయాకర్, ఉపసర్పంచ్ బండరాజు, పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్, వార్డు సభ్యు లు, గ్రామస్తులు ఉన్నారు.
బస్వాపూర్‌ను సందర్శించిన కేంద్ర బృందం..
మండలంలోని బస్వాపూర్‌ను ఆదివారం స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్ర బృందం సందర్శించింది. కేంద్ర బృందం సభ్యులకు ఎంపీపీ కొక్కుల కీర్తి, సర్పంచ్ సత్తయ్య స్వాగతం స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర బృందం సభ్యులు గ్రామంలో పర్యటించి ఇంకుడుగుంతలు, మరుగు దొడ్లు, డంపింగ్‌యార్డు, చెత్త సేకరణ తీరును పరిశీలించారు. గ్రామంలో పారిశుధ్య పనులను చూసి బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. వారి వెంట ఎంపీడీవో శ్రీధర్, ఎంపీవో సురేశ్, శానిటేషన్ మేనేజర్ మహేందర్‌రెడ్డి, కార్యదర్శి నిహారిక, ఉపసర్పంచ్ రాధిక, వార్డు సభ్యులు ఉన్నారు.
జనగామను సందర్శించిన ఎస్ఎస్జీ బృందం..
మండలంలోని జనగామ గ్రామాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ కార్యక్రమంలో భాగం గా ఆదివారం ఎస్ఎస్జీ బృందం సందర్శించింది. గ్రామం లో స్వచ్ఛభారత్, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో చేపట్టిన పను ల అమలు తీరును క్షేత్ర స్థాయిలో చూసి ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడారు. స్వచ్ఛభారత్, పల్లె ప్రగతి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ప్రభు త్వ పథకాలను సద్వినియోగం చేసుకొని గ్రామాలు అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఎస్ఎస్జీ బృందం సభ్యులకు ఎంపీపీ లక్ష్మి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. వారి వెంట స్వచ్ఛభారత్ మిషన్ కో-ఆర్డినేటర్ చెన్నారెడ్డి, ఎంపీడీవో సత్యపాల్‌రెడ్డి, సర్పంచ్ మానస, ఎంపీటీసీ కవిత, ఎంపీవో కుమార్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.