
సిద్దిపేట టౌన్, జూన్ 29 : కేసుల్లో శిక్షల శాతం పెంచి, నేరాలను అరికట్టాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. పెండింగ్ కేసులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ దరఖాస్తుల్లో పారదర్శకంగా విచారణ చేసి రిపోర్ట్స్ ఆన్లై న్లో అప్లోడ్ చేయాలన్నారు. క్రైమ్ అగనెస్ట్ ఉమెన్ కేసులను త్వరగా ఇన్వెస్ట్‌గేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయాలన్నారు. ట్రయల్ నడిచే సమయంలో పోలీసు అధికారులు సాక్షులను మోటివేట్ చేసి నిందితులకు శిక్ష పడేవిధంగా చూడాలన్నారు. రిసెప్షన్ వర్టికల్లో వచ్చిన ప్రతీ దరఖాస్తును ఆన్లైన్ నమోదు చేయాలన్నారు. బ్లూకోల్ట్స్ అధికారులు విధిగా పాయింట్ బుక్ చెక్ చేయాలన్నారు. ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బందికి ప్రతిభను బట్టి రివార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రతీ పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరికి ట్రైనింగ్ ఇచ్చినట్లు చెప్పారు. సైబర్ వారియర్స్ 2వ హ్యాండ్ బుక్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి ఆయన కార్యాల యంలో ప్రారంభించారు. రాష్ట్రం మొత్తం యూనిఫాం సర్వీస్ డెలివరీ ఒకే విధంగా ఉండాలన్నారు.
పోలీసులకు అప్రిసియేషన్ సర్టిఫికెట్ల అందజేత
వర్టికల్ వారీగా 2020 సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసు అధికారులకు, సిబ్బందికి అప్రిసియేషన్ సర్టిఫికెట్ల ఇవ్వడం జరుగుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. అందులో భాగంగానే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉత్తమ వర్టికల్ అధికారులు, సిబ్బందికి సర్టిఫికెట్లు అందిస్తున్నామని తెలిపారు. బెజ్జంకి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న టెక్‌టీమ్ కానిస్టేబుల్ అశోక్‌కు, బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్, మద్దూరు పోలీసుస్టేషన్లో రిసెప్షనిస్టుగా విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ స్రవంతి, గౌరారం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న శ్రీనివాస్, చేర్యాల పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ స్వప్న, హుస్నాబాద్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న త్యాగరాజుకు డీజీపీ కార్యాలయం నుంచి సర్టిఫికెట్లు అందజేశారు. సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌లో శిక్షల శాతాన్ని పెంచినందుకు పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్‌ను, పోలీసు అధికారులను, సిబ్బందిని డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ డీసీపీ శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీలు రామేశ్వర్, నారాయణ, ఏసీపీ సైదులు, ఇన్స్పెక్టర్లు క్రాంతికుమార్, యాలాద్రి, ఎస్సై అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.