సిద్దిపేట టౌన్, అక్టోబర్ 1: దసరా పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నది. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం బస్సులను ఏర్పాటు చేస్తున్నది. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 63 బస్సులను సిద్ధం చేశారు. జిల్లాలో నాలుగు ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తరలించేందుకు 53 బస్సులు ఏర్పాటు చేసింది. మరో 10 బస్సులు ఆంధ్రాప్రాంతంలోని ముఖ్యమైన ప్రాంతాలకు నడిచేలా చర్యలు తీసుకున్నది. సిద్దిపేట డిపో పరిధిలో ప్రయాణికుల కో02సం 30 బస్సులను గజ్వేల్, ప్రజ్ఞాపూర్ డిపో పరిధిలో 20, దుబ్బాకలో 8, హుస్నాబాద్‌లో ఐదు ఇలా మొత్తం 63 బస్సులను పండుగ కోసం ఏర్పాటు చేసింది.
నిరంతరాయంగా బస్సులు
దసరా పండుగను పురస్కరించుకొని ఆర్టీసీ గతనెల 25 నుంచి ఈనెల 6వ తేదీ వరకు ప్రయాణికుల సంక్షేమం కోసం నిరంతరాయంగా బస్సులు నడిచేలా చర్యలు తీసుకున్నది. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు పక్కాగా చర్యలు చేపట్టారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.ఆయా డిపోల మేనేజర్లు ప్రణాళికులను పక్కాగా సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి నడుపుతున్నది.
సాధారణ చార్జీలే…
ప్రజారవాణా ఆర్టీసీ ప్రయాణికుల్లో చెరగని ముద్ర వేసుకున్నది. ప్రయాణికులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నది. ప్రయాణికుల క్షేమమే పరమావధిగా ఆర్టీసీ పండుగ వేళ సాధారణ చార్జీలతోనే ప్రయాణికులను చేరవేయనున్నది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. 30 మంది ప్రయాణికులు ఉన్నైట్లెతే నేరుగా సంస్థను సంప్రదిస్తే వారికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తున్నది.
బస్సుల సంఖ్య పెంచుతాం
ప్రతి ఏడాది మాదిరిగానే దసరా పండుగకు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేశాం. ఎక్కడా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. వివిధ ప్రాంతాల్లో సుమారు 11 రోజుల పాటు స్పెషల్ బస్సులు నడిపిస్తున్నాం. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు. నమ్మకానికి మారుపేరుగా ఉన్న ప్రజారవాణా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలి. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుతాం. సంస్థ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. -కిషన్‌రావు, సిద్దిపేట డిపో మేనేజర్