గజ్వేల్ రూరల్, మే 24 : రైతులు మీ సేవా కేంద్రాల్లో ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని ఏడీఏ బాబూనాయక్, ఏవో నాగరాజు సూచించారు. మంగళవారం గజ్వేల్, పిడిచేడ్, బయ్యారం, బెజుగామ గ్రామాల్లో రైతులకు పీఎం కిసాన్ పథకంపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 జనవరి 31 వరకు పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన రైతులు ఈ-కేవైసీ చేసుకోవాలని సూచించారు. ఆధార్‌కార్డుకు ఫోన్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని, లేదంటే పీఎం కిసాన్ వర్తించదన్నారు.
మద్దూరులో..
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పెట్టుబడి సహాయం తీసుకుంటున్న రైతులు ఈ-కేవైసీ చేయించుకోవాలని ఏఈవో రాకేశ్ అన్నారు. మండలంలోని గాగిళ్లాపూర్‌లో ఏఈవో ఆధ్వర్యంలో రైతులు ఈ-కేవైసీ చేయించుకున్నా రు. ఈ సందర్భంగా ఏఈవో మాట్లాడుతూ పీఎం కిసాన్ డబ్బులు పడుతున్న రైతులు విధిగా ఈ-కేవైసీ చేయించుకోవాలన్నారు. ఈనెల 31 వరకు ఈ-కేవైసీని చేయించుకోవాలని, లేదం టే పీఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్లో జమ కావని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణవేణిచంద్రమౌళి, పీఏసీఎస్ డైరెక్టర్ మల్లేశం పాల్గొన్నారు.
మిరుదొడ్డిలో..
పీఎం కిసాన్ సమ్మాన్ పథకంలో భాగంగా పంట రుణం పొందాలంటే రైతులు ఈ-కేవైసీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారి బోనాల మల్లేశం సూచించారు. మిరుదొడ్డి రైతు వేదికలో రైతులకు ఈ-కేవైసీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ మండలంలోని 20 గ్రా మాల్లో 10,032 మంది రైతులు ఉండగా, ఇందులో 5, 400 మంది రైతులు మాత్రమే ఈ-కేవైసీ చేసుకున్నారని తెలిపారు. ఈనెల 31 వరకు రైతులంతా ఈ-కేవైసీ చేసుకోవాలని సూచించారు. అనంతరం ఈ-కేవైసీలో రైతుల పేర్లను అధికారులు నమోదు చేశారు. కార్యక్రమంలో ఏఈవోలు లోహిత్, సాయికుమార్, నిర్మల, నవ్య పాల్గొన్నారు.