గజ్వేల్ రూరల్, ఏప్రిల్ 24 : అధికార దాహంతోనే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అబద్ధ్దాలు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం గజ్వేల్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికార దాహంతోనే బీజేపీ నాయకులు పాదయాత్రలు చేపడుతున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కుమ్ములాటలతో సరిపోతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందకపోతే రోడ్లపై ధర్నాలు చేశారన్నారు. కానీ, నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచిందన్నారు. రైతులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఉన్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి చేసింది శూన్యమని, వరంగల్‌కు కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయాలను కేటాయించలేకపోయిందన్నారు. దేశంలోనే గుజరాత్ నెంబర్ వన్ అన్న నేతలే నేడు తెలంగాణనే దేశానికి రోల్ మోడల్ అంటున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో స్కామ్‌ల భాగోతం కనిపించేదన్నారు. సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్లలో రాష్ట్ర ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగారన్నారు. పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ప్రజలు, రైతులకు తాగు, సాగునీటి అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. దళిత దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు కనిపిస్తాయన్నారు.
27న గ్రామాల్లో జెండావిష్కరణలు..
టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న ఉదయం గ్రామాలు, పట్టణాల్లో పార్టీ జెండావిష్కరణ కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటామని తెలిపారు. పార్టీ అధినేత ఇచ్చిన పిలుపుతో కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అంతకుముందు ఫుట్‌బాల్ సమ్మర్ క్యాంపుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ చైర్ పర్సన్ మాదాసు అన్నపూర్ణాశ్రీనివాస్, జడ్పీటీసీ బాలమల్లు, ఎంపీపీ అమరావతి, కౌన్సిలర్ రహీం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమార్‌యాదవ్, నాగరాజు, పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు స్వామిచారి, నాయకులు ఉమార్, రవీందర్, మతిన్ పాల్గొన్నారు.