రామాయంపేట, మార్చి28: తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనాలని రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం ఏఎంసీ కార్యాలయంలో తీర్మానాలు చేసి కాపీల ను ప్రధానమంత్రి మోదీకి పోస్టులో పంపించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాజిరెడ్డి, సభ్యులు ఉన్నారు.
ఎంపీపీ కార్యాలయంలో..
కేంద్రం తెలంగాణలోని వడ్లు కొనాలని, లేకుంటే ఉద్యమిస్తామని రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి అన్నారు. ఎంపీపీ కార్యాలయంలో ఎంపీటీసీలు తీర్మాన పత్రాలు రాసి ఎంపీడీవో యాదగరిరెడ్డికి అందజేశారు.
చిలిపిచెడ్‌లో..
రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనాలని ఎంపీపీ వినోదా దుర్గారెడ్డి డిమాండ్ చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీలతో సమావేశం నిర్వహించారు. పంజాబ్ తరహాలో వందశాతం ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మం డల అధ్యక్షుడు సుభాశ్‌రెడ్డి, ఎంపీటీసీలు మల్లయ్య, సునీత పాల్గొన్నారు.
తూప్రాన్‌లో..
యాసంగి ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలని డిమాండ్ చేస్తూ యావాపూర్ పంచాయతీ సభ్యులు తీర్మానించారు. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, పీయూష్ గోయల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు బొల్లంపల్లి బాబుల్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శేరి నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ యంజాల లక్ష్మి, ఎంపీటీసీ సంతోష్‌రెడ్డి, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.
చిన్న శంకరంపేట..
యాసంగిలో పండిన ధాన్యాన్ని కొనాలని చిన్నశంకరంపేట సహకార సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. సంఘ సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్ అంజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో మండల రైతు బంధు అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సర్పంచ్ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ నగేశ్, డీసీసీబీ మేనేజర్ ఎల్లం, డైరెక్టర్లు పాల్గొన్నారు.
నిజాంపేట..
రైతు సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వానికి సోయి ఉంటే యాసంగి ధాన్యాన్ని కొనాలని నార్లపూర్ సర్పంచ్ అమరసేనారెడ్డి అన్నారు. పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులతో కలిసి తీర్మానించారు. ఈ పత్రాన్ని ఎంపీపీ సిద్ధిరాములుకు అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంజీవ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్ ఉన్నారు