సిద్దిపేట, మార్చి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించడం నేర్పించండి’ అన్న కేంద్ర మంత్రిపై యావత్తు రైతులోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అది పాలిస్తున్న రాష్ర్టాలకేనా? లేక అన్ని రాష్ర్టాలకు పని చేస్తున్నదా? అని సూటిగా కేంద్ర మంత్రులను ప్రశ్నిస్తున్నది. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపేది లేదని టీఆర్ఎస్ ప్రకటించింది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని గ్రామపంచాయతీల పాలక వర్గాలు పంజాబ్ తరహా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. ఈ తీర్మాన ప్రతులను పోస్టు ద్వారా ప్రధాని, కేంద్ర మంత్రికి పంపారు. కేంద్ర ప్రభుత్వంపై పోరులో భాగంగా నేడు(ఆదివారం) మండల పరిషత్‌లు, సోమవారం జిల్లా పరిషత్‌లు, 31న అన్ని మున్సిపాలిటీల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేయనున్నారు. మార్కెట్ కమిటీలు, సహకార సంఘాల్లో తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు.
తెలంగాణ రైతు తెగువ చూపిస్తాం
పంజాబ్ తరహాలో తెలంగాణలోనూ మొత్తం ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా తీర్మానాలు చేస్తున్నారు. వాటిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పోస్టుల ద్వారా పంపుతున్నారు. శనివారం మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తీర్మానాల కాపీలను కేంద్ర ప్రభుత్వానికి పోస్టు చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరా టం ఆపేది లేదని టీఆర్ఎస్ ప్రకటించింది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు శనివారం ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా అన్ని గ్రామాల్లోని గ్రామపంచాయతీ పాలక వర్గాలు పంజాబ్ తరహా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. ఈ తీర్మాన ప్రతులను పోస్టు ద్వారా ప్రధాని, కేంద్ర మంత్రికి పంపారు. కేంద్ర ప్రభుత్వంపై పోరులో భాగంగా నేడు (ఆదివారం) మం డల పరిషత్‌లు, సోమవారం జిల్లా పరిషత్‌లు, 31న అన్ని మున్సిపాలిటీల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేయనున్నారు. మార్కెట్ కమిటీలు, సహకార సంఘాలు ఇలా అన్ని స్థాయిల్లో తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. ఈ నెల 29న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చేసే సమ్మెకు టీఆర్ఎస్ పార్టీ సంఘీభావం తెలుపుతుంది. ఇలా అన్ని రకాలుగా ఉద్యమాలకు టీఆర్ఎస్ సిద్ధమైంది. ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు టీఆర్ఎస్ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రైతుకు దన్నుగా నిలవాలని పిలుపునిచ్చారు.
దేశంలో తెలంగాణ భాగం కాదా…
కేంద్ర ప్రభుత్వం తన పనిని విస్మరించి, తమకేం సంబంధం లేదనట్లుగా, ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం లేనట్లుగా వ్యవహరిస్తున్నదని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వారు పాలిస్తున్న రాష్ర్టాలకేనా? లేక అన్ని రాష్ర్టాలకు పనిచేస్తుందా? అని సూటిగా కేంద్ర మంత్రులను రైతులు ప్రశ్నిస్తున్నారు. ఏ రాష్ట్రంలో గానీ, రైతులు పండించిన వడ్లను అక్కడి రాష్ర్టాల అవసరాల మేరకు ఉంచుకొని, మిగతావి దేశ అవసరాలకు ఇస్తారు. ఆయా రాష్ర్టాల నుంచి కేంద్రం సేకరించి, దేశవ్యాప్తంగా ఆహార భద్రతను కాపాడాల్సిన భాద్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ఇన్నాళ్లు కేంద్రంలో పాలించిన అన్ని పార్టీలు చేశాయి. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కొర్రీలు పెట్టి, నానా యాగీ చేస్తూ రైతులను మోసం చేస్తున్నది. రైతులు పండించిన పంటను చివరి గింజ వరకూ కొనుగోలు చేయాల్సిందేనని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
రైతాంగానికి దన్నుగా రాష్ట్ర ప్రభుత్వం
నాడు సమైక్య రాష్ట్రంలో రైతులు అన్నివిధాలుగా అరిగోస పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉద్యమ నేతనే సీఎం కేసీఆర్ కావడంతో రైతులు కష్టాలు తీర్చారు. సీఎం కేసీఆర్ రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. రైతుబంధు కింద ఏటా రెండు పంటలకు ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్నారు. రైతుబంధు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎనిమిది పంటలకు సాయం అందించారు. 59,84,281 మంది రైతులకు ఎనిమిది క్రాప్ల్లో రూ. 6,154.25 కోట్లు నేరుగా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమచేసింది. దీంతో రైతులకు పెట్టుబడులకు రందిలేకుండా పోయింది. సిద్దిపేట జిల్లాలో 20,08,784 మంది రైతులకు రూ.2168.41 కోట్లు, మెదక్ జిల్లాలో 17,26,509 రైతులకు రూ.1450.02 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 21,76,988 లక్షల మంది రైతులకు రూ.2535.82 కోట్లను రైతుబంధు కింద ప్రభుత్వం అందజేసింది. రైతు ఏదైనా కారణం చేత మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షలను రైతుబీమా ద్వారా అందిస్తున్నది. వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంట్, పుష్కలంగా సాగునీరు, సమయానికి ఎరువులు, విత్తనాలు అందిస్తూ అండగా నిలబడుతున్నది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికే చిత్తశుద్ధితో కృషిచేస్తున్నది. ఇది చూసి ఓర్వని బీజేపీ ప్రభుత్వం కుంటిసాకులు చెప్పి తెలంగా రైతులపై కక్ష సాధింపులకు దిగుతున్నది.
పీయూష్.. మాటలు వెనక్కి తీసుకో..
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పీయూష్‌గోయల్ తెలంగాణ ప్రజల, రైతుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలను వెంటనే భేషరతుగా వెనక్కి తీసుకోవాలి. పీయూష్ గోయెల్ది కచ్చితంగా కడుపుమంటేనని, త్వరలోనే బీజేపీకి ప్రజలే బుద్దిచెబుతారు.
– దొంతిరెడ్డి వెంకట్‌రెడ్డి, గోమారం, శివ్వంపేట
తెలంగాణ సాగును ఓర్వలేకపోతున్న కేంద్రం
తెలంగాణలో రైతులు సాగుచేస్తున్న పంటలు చూసి ఓర్వలేకనే కేంద్ర ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఒకప్పుడు నీరులేక ఇబ్బందులుపడ్డ తెలంగాణ రైతులు నేడు ప్రాజెక్టులు, కాలువల నిర్మాణాలతో బీడుభూములు సస్యశ్యామలం అవుతున్నాయి. రైతులు పండించిన ధాన్యం కొనలేని కేంద్రం తెలంగాణ రైతులపై చిన్నచూపు చూడటం సరికాదు. త్వరలోనే కేంద్రానికి తెలంగాణ ప్రజలు తగిన బుద్దిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
– సీహెచ్ వెంకటేశం, రైతు, హత్నూర
తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లాయి..
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి నూకలు చెల్లాయి. యాసంగిలో వడ్లు కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ కోరితే కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ పిచ్చికూతలు కూస్తున్నారు. ఇతర రాష్ర్టాలకు అన్నంపెట్టే అన్నపూర్ణగా మన రాష్ట్రం ఆవిర్భావించింది. రికార్డు స్థాయిలో ధాన్యం పండించిందని గుర్తు చేశారు.