రామాయంపేట, మార్చి 11 : మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి చొరవతో ఎట్టకేలకు పోస్టల్‌శాఖ సిబ్బంది రామాయంపేట పట్టణంలోని మార్కెట్ స్థలంలో భవన నిర్మాణానికి కొలతలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని దశాబ్ద కాలంగా ఖాళీగా ఉన్న స్థలంలో తపాలాశాఖ సిబ్బంది శుక్రవారం పనులను ప్రారంభించి, కొలతలు నిర్వహించి ముగ్గు పోశారు. కొన్నేండ్లుగా తపాలా భవనం అద్దె ఇంట్లో ఉండడమే గాకుండా పట్టణవాసులకు అందుబాటు లో లేదు. మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం తదితరులు పింఛన్‌దారుల ఇబ్బందులను ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో పోస్టల్‌శాఖ అధికారులతో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడి ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పట్టణంలో పోస్టల్ భవనం నిర్మించేలా చర్యలు చేపట్టాలని కోరారు. స్పందించిన పోస్టల్ శాఖ అధికారులు శుక్రవారం హైదరాబాద్ నుంచి రామాయంపేటకు చేరుకుని స్థలా నికి కొలతలు నిర్వహించి పనులను చేపట్టారు. తపాలాశాఖ పను లు చేపట్టడంతో పట్టణంలోని పింఛన్‌దారులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి కృతజ్ఙతలు తెలిపారు. స్థలాన్ని పరిశీ లించినవారిలో తపాలా సిబ్బంది ప్రవీణ్, ఏఈ హేమంత్, జూనియర్ ఇంజినీర్ ఉస్మాన్వలి, మున్సిపల్ సిబ్బంది ప్రసాద్ ఉన్నారు.