రామాయంపేట, మార్చి 11 : గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించి, వలసలను నివారించడమే లక్ష్యంగా ఉపాధి హామీ పనులను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో యాదగిరిరెడ్డి అన్నారు. వేసవి కాలం దృష్ట్యా ఉపాధి సిబ్బంది, మేట్లు, కూలీలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రామాయంపేట మం డలం వెంకటాపూర్(ఆర్) గ్రామంలోని ఉపాధి పనులను పరిశీలించి, సీనియర్ మేట్లను మహిళా దినోత్సవం సందర్భంగా శాలువాతో సన్మానించారు. ఎండాకాలం దృష్ట్యా కూలీలు జా గ్రత్తలు పాటిస్తూ పనులు చేయాలని, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఉపాధి కూలీలకు కార్యదర్శులు తగిన వసతులు కల్పించాలన్నారు.
కాట్రియాల గ్రామంలో ఉపాధి కూలీలు, మేట్లను ఏపీవో శంకర్, సర్పంచ్ మైలారం శ్యామూల్ సన్మానించారు. జాబ్‌కార్డులు ఉన్నవారు తప్పనిసరిగా పనులకు రావాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి శామల, టీఏ ప్రతాప్ పాల్గొన్నారు.
ఉపాధి హామీ కూలీలకు సన్మానం
కూలీల వలసలు నివారించడానికే ఉపాధి పనులు ప్రారంభించామని ఏపీవో శ్రీనివాస్ అన్నారు. ఎంపీవో రాజేందర్‌తో కలిసి నిజాంపేటలోని విశ్వపతి కుంటలో ఉపాధి కూలీలు చేస్తున్న పనులను పరిశీలించారు. అనంతరం మహిళా ఉపాధి కూలీలకు శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఏపీవో శ్రీనివాస్ మాట్లాడు తూ.. జాబ్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పిస్తామన్నారు.కార్యక్రమంలో ఉపాధి హామీ ఈసీ నాగిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి అంజయ్య ఉన్నారు.