Anthropic AI | ఆంధ్రోపిక్ ఏఐ టాప్ ఇంజినీర్ మృణాంక్ రాజీనామా.. ప్రపంచం ప్రమాదంలో ఉందని ఆవేదన
Anthropic AI : ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ఏఐ సంస్థ ఆంథ్రోపిక్. ఈ సంస్థ రూపొందించిన కొత్త టూల్.. పలువురు ఐటీ ఉద్యోగులకు ఎసరుపెట్టే అవకాశాలుండటంతో సంచలనంగా మారింది.
Anthropic AI : ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ఏఐ సంస్థ ఆంథ్రోపిక్. ఈ సంస్థ రూపొందించిన కొత్త టూల్.. పలువురు ఐటీ ఉద్యోగులకు ఎసరుపెట్టే అవకాశాలుండటంతో సంచలనంగా మారింది. ఇంతగా వృద్ధి చెందుతున్న ఆంథ్రోపిక్ ఏఐ సంస్థకు చెందిన కీలక ఉద్యోగి ఒకరు తాజాగా రాజీనామా చేశారు. ఈ సంస్థలో సేఫ్‌గార్డ్ రీసెర్చ్ టీమ్‌ను లీడ్ చేసిన మృణాంక్ శర్మ కంపెనీకి రాజీనామా చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఈ సందర్భంగా తన ఎస్ఎంలో కీలక విషయాలు వెల్లడించారు. ‘‘ప్రపంచం ప్రమాదంలో ఉంది. అది ఏఐ వల్లో, బయో వెపన్స్ వల్లో కాదు. ఒకదానికొకటి సంధానమై ఉన్న సంక్షోభాలతో ప్రపంచం ప్రమాదంలో ఉంది. ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి మన జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ఏ పరిణామాల్నైనా ఎదుర్కోగలం. నేను ఆంథ్రోపిక్ సంస్థను వీడాలని నిర్ణయించుకున్నా. నేనేం సాధించాలనుకున్నానో అది సాధించా. పీహెచ్డీ పూర్తవ్వగానే ఏఐ సేఫ్టీలో పనిచేసేందుకు రెండేళ్లక్రితం శాన్ఫ్రాన్సిస్కో వచ్చా. ఇక్కడికొచ్చి ఏఐ విషయంలో నేను చేసిన కృషికి ఆనందంగా ఫీలవుతున్నా’’ అంటూ మృణాంక్ రాసుకొచ్చారు.
Today is my last day at Anthropic. I resigned.
Here is the letter I shared with my colleagues, explaining my decision. pic.twitter.com/Qe4QyAFmxL
— mrinank (@MrinankSharma) February 9, 2026
తన భవిష్యత్ ఆలోచనల గురించి కూడా మృణాంక్ వెల్లడించాడు. తాను కవిత్వం రాయాలనుకుంటున్నానని, అందులో డిగ్రీ కూడా సాధించాలని అనుకుంటున్నానని తెలిపాడు. ఇక.. ఆంథ్రోపిక్ సంస్థ ఇటీవలే క్లాడ్ ఓపస్ 4.6ను లాంఛ్ చేసింది. ప్రస్తుతం ఈ సంస్థ విలువ 350 బిలియన్ డాలర్లుగా ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

