Rayapol | రాయపోల్, ఫిబ్రవరి 18: సిద్దిపేట జిల్లా బేగంపేట జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు“జిజ్ఞాస” జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు. ఈ జాతీయ స్థాయి కాంపిటీషన్లో బేగంపేట విద్యార్థులు పాల్గొనడం ఇది వరుసగా రెండోసారి.
ఈ నెల 17, 18వ తేదీల్లో మహారాష్ట్రలోని పుణేలో జరగనున్న ఈ కాంపిటీషన్లో దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయికి ఎంపికైన 100 మంది విద్యార్థులు పాల్గొంటారు. తమ సృజనాత్మక ఆవిష్కరణలను ప్రదర్శిస్తారు. జాతీయ స్థాయి వేదికపై తమ ప్రతిభను చాటుకుని జిల్లా ఖ్యాతిని పెంచాలని విద్యార్థులకు జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేసి, వారిని ప్రోత్సహించిన గైడ్ టీచర్ భాస్కర్ రెడ్డిని డీఈవో, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రమీల, అధ్యాపక బృందం అభినందించారు.