రాయపోల్ జనవరి 27 : రాయపోల్ మండల ఇంచార్జీ ఎంపీఓగా రాయపోల్ పంచాయతీ కార్యదర్శి శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇకపై పంచాయతీ కార్యదర్శిగా, ఎంపీవోగా విధులు నిర్వహించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం శివకుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మండల ఎంపీ బాధ్యతలు అప్పగించడంతో మరింత బాధ్యత పెరిగిందని అన్నారు.
అందరి సహకారంతో తన విధులను సక్రమంగా నిర్వహిస్తానని శివకుమార్ తెలిపారు. మండల ప్రజలకు, సర్పంచులకు, గ్రామస్థాయి అధికారులకు అందుబాటులో ఉండి అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూస్తానని చెప్పారు. మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు సహకారం అందించాలని శివకుమార్ కోరారు.