మద్దూరు(ధూళిమిట్ట), మార్చి07: ధూళిమిట్ట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ను వెంటనే తెరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆముదాల రంజిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధూళిమిట్టలో మూతపడిన హాస్టల్‌ను ఎస్ఎఫ్ఐ నాయకులు సందర్శించి, నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో ఉన్న ఎస్సీ హాస్టల్ మూతపడడంతో నిరుపేదలైన విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి హాస్టల్‌ను తెరిపించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమించనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు తాడూరి భరత్‌కుమార్, జిల్లా కమిటీ సభ్యులు సుద్దాల వంశీ, నాయకులు ప్రసాద్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.