చేర్యాల : కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి వారిని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయంలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు.
పూజా కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏర్పుల మహేష్, ఆలయ సూపరింటెండెంట్ శ్రీరాములు, గజ్జె వెంకటేష్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.