
గృహ కార్మికులకు ఈ-శ్రామ్ పోర్టల్‌పై అవగాహన
అసిస్టెంట్ లేబర్ అధికారి ప్రవీణ్ కుమార్
సంగారెడ్డి, ఆగస్టు 26: గృహ కార్మికులకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రామ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిందని ప్రతి కార్మికులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా అసిస్టెంట్ లేబర్ అధికారి ప్రవీణ్ కుమార్ సూచించారు. గురువారం సంగారెడ్డి పట్టణంలోని మెడ్వాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మాంటిపోర్ట్ సోషల్ ఇన్సిట్యూట్ సహకారంతో కార్యిలయంలో ఈ-శ్రామ్ పోర్టల్‌పై సంఘం కార్మికులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన లేబర్ అసిస్టెంట్ అధికారి మాట్లాడుతూ ఈ-శ్రామ్ పోర్టల్‌లో గృహ కార్మికులు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ప్రతి గృహ కార్మికురాలు తన ఆధార్ కార్డు, ఫోన్‌నెంబర్, బ్యాంకు ఖాతానెంబర్, జిరాక్స్ కాఫీలు ఇవ్వాలన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ప్రభుత్వాలు అందజేసే రాయితీలకు అర్హులవుతారని సూచించారు. అనంతరం మెడ్వాన్ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల్లో గృహ కార్మికులు ఒక భాగమని, సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 500 మందికి పైగా గృహ కార్మికులు ఉన్నారన్నారు. కార్మికులందరికీ రిజిస్ట్రేషన్ చేయిస్తామని, ఈ అవగాహన కార్యక్రమానికి తరలివచ్చిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఏసీ కో-ఆర్డినేటర్ రాములు, మెడ్వాన్ కో-ఆర్డినేటర్ స్వప్న, చైల్డ్‌లైన్ కో-ఆర్డినేటర్ ముజీబ్, గృహ కార్మిక సంఘం అధ్యక్షురాలు రాధ, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.