rayapole | రాయపోల్, అక్టోబర్ 15 : సిద్ధిపేట జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 14-10-2025న గజ్వెల్లో జరిగిన జోనల్ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయపోల్ విద్యార్థులు ఏ.యశ్వంత్ , జీ.సౌమ్య, అండర్ 14 విభాగంలో ద్వితీయ స్థానం సాధించి పెద్దపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారని మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి గురువారం తెలిపారు.
అదే విధంగా సంగారెడ్డిలో జరిగే అండర్ 19 వాలీబాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు A.సంజన ఎంపికైందని వెల్లడించారు. ఈ ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
కాగా రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికవడం పట్ల గ్రామస్తులు, యువజన సంఘాలు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Kumuram Bheem | కుమ్రం భీం పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి : పెందోర్ దాదిరావు
Murder | తెనాలి చెంచుపేటలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ఖరారు చేసిన బీజేపీ