హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): సీఎస్ రామకృష్ణారావుతో ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్(ఇస్టా) ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఈ మేరకు ఇస్టా ఇండియా ప్రతినిధి కే కేశవులు ఆధ్వర్యంలో గురువారం సచివాలయంలో సీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం, విత్తన నాణ్యతను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
2047 వరకు తెలంగాణ రాష్ట్రం ప్రపంచ విత్తన కేంద్రంగా మారుతుందని ఇస్టా అధ్యక్షుడు కేశవులు పేర్కొన్నారు. ఈ భేటీలో ఇస్టాలో భాగస్వామ్యమైన అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, ఫిలిఫైన్స్, పోలాండ్, అర్జెంటీనా, ఉరుగ్వే, స్విట్జర్లాండ్ ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, ఇస్టా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఈనెల 21 వరకు హైదరాబాద్‌లో కొనసాగనున్నది.