Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
Rayapol SI |రాయపోల్ మండలంలో బెల్ట్ షాపులు, గంజాయి, జూదం, సైబర్ నేరాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని ఎస్ఐ లింగం హెచ్చరించారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.
Rayapol SI | రాయపోల్, అక్టోబర్ 10 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణతోపాటు అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాయపోల్ నూతన ఎస్ఐ లింగం హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయించే బెల్ట్ షాపులపై నిఘా కొనసాగుతుందని ఎస్ఐ పేర్కొన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయం, వినియోగం, గుట్కా విక్రయాలు, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలు ఎక్కడైనా కనిపిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్య, ఉపాధి, క్రీడలు, సామాజిక సేవపై దృష్టి సారించాలని ఎస్ఐ సూచించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. యువత గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములై సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ లింగం సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారాన్ని అడిగితే వెల్లడించవద్దన్నారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం, తెలియని వ్యక్తులకు డబ్బులు పంపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు కనిపిస్తే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు. ప్రజల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే అవగాహన కార్యక్రమాల ద్వారా బాల్యవివాహాలు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, ఇతర సామాజిక సమస్యలపై ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
మండలంలోని అన్ని గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు సర్పంచులు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు సమన్వయంతో పనిచేయాలని ఎస్ఐ లింగం పిలుపునిచ్చారు. అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహించకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు..
Accident | వలస కూలీల ట్రాక్టర్‌ను ఢీకొన్న టిప్పర్.. ఒకరు మృతి, 32 మందికి గాయాలు!
Salman Khan | యూట్యూబ్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్.. కోచ్‌గా, స్టూడెంట్‌గా భాయ్ సందడి!
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

