జహీరాబాద్, మార్చి 9: జహీరాబాద్ ఎంపీ టికెట్‌ను మున్నూరుకాపులకు కేటాయించాలని కోరుతూ ఆ సంఘం నేతలు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు వినతిపత్రం అందజేశారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో వారు హరీశ్‌రావును కలిశారు. మీ వినతిని అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. మున్నూరుకాపు నేతలకు గతంలో ఎంతోమందికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించారని ఈ సందర్భంగా హరీశ్‌రావు వారితో గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో ఏరోజు కరెంట్, సాగు, తాగునీటి సమస్య తలెత్తలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో అన్నీ సమస్యలే నెలకొన్నాయని హరీశ్‌రావు అన్నారు. జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్‌ను రెండుసార్లు గెలిపిస్తే ఆయన పార్టీకి మోసం చేశారన్నారు. బీబీ పాటిల్‌కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని నేతలకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ మున్నూపుకాపు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.