చేర్యాల, సెప్టెంబర్ 4 : సిద్దిపేట చేర్యాల మండలంలోని వీరన్నపేట గ్రామ పంచాయతీ సిబ్బంది గూడెపు భిక్షపతి ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి రూ.5వేల ఆర్ధికసహాయం ప్రకటించారు. గురువారం బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు అరిగే కనకయ్య, మాజీ ఎంపీటీసీ శివశంకర్, పెద్దింటి ప్రసాద్, సోషల్ మీడియా మండల ఇన్చార్జి బంగారిగళ్ల కిరణ్కుమార్, నాయకులు పోకల శ్రీకాంత్, రోమాల సురేష్, గూడెపు మల్లయ్య, పిల్లికండ్ల నర్సింహులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఎమ్మెల్యే పంపించిన నగదును అందజేశారు.
గ్రామస్తుల ఆర్థిక సహాయం
మృతుడు భిక్షపతి కుటుంబానికి వీరన్నపేట గ్రామస్తులు రూ.25,300ను అందజేశారు. భిక్షపతి చేసిన సేవలను గుర్తించి గ్రామంలో పలువురు కలిసి నగదు సేకరించి మృతుని కుటుంబానికి అందజేశారు.