రామాయంపేట, నవంబర్ 12: రామాయంపేట పట్టణంలోని మూడు సెంటర్లలో విద్యార్థులకు నేషనల్ అచీవ్మెంట్ సర్వేఆధ్వర్యంలో అభ్యాసన సామర్థ్య పరీక్షలను నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని మంజీర, వాణి విద్యాలయంలో 8, 10 తరగతులకు, గురుకుల విద్యాలయంలో 5, 8 తరగతుల విద్యార్థులకు అభ్యాసన పరీక్షలను నిర్వహించారు. మూడు పరీక్ష కేంద్రాల్లో 180 మంది విద్యార్థులకు పరీక్షలను నిర్వహించారు.
వెల్దుర్తిలో…
వెల్దుర్తి, నవంబర్12: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు నేషనల్ అచీవ్మెంట్ సర్వే లో భాగంగా అభ్యాసన సామర్థ్య పరీక్షను నిర్వహించినట్లు వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష ఇన్చార్జి రఘునందన్‌రెడ్డి, అధ్యాపకులు బాలరాజు తెలిపారు. వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు మాసాయిపేటలోని కొప్పులపల్లి పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహిస్తున్నామన్నారు.ఈ పరీక్షల నిర్వహణ ఎంఈవో యాదగిరి పరిశీలించారు.
పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఎంఈవో
మండల పరిధిలోని పలు పాఠశాలలో నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో భాగంగా అభ్యాసన సా మర్థ్య పరీక్ష కేంద్రాలను ఎంఈవో నీలకంఠం సందర్శించా రు. విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నది. మండలంలో ఏడు పాఠశాలలను ఎంపిక చేయగా, 173 మందికి 153 మంది పరీక్షలు రాశారు. 3,5వ తరగతులకు తెలుగు, గణితం, ఈవీఎస్ పరీక్షను, 8,10వ తరగతులకు తెలుగు, ఇంగ్లిష్, గణితము, సైన్స్, సోషల్ సబ్జెక్టులో పరీక్షలు నిర్వహించారు.
పాఠశాలను సందర్శించిన డీఈవో
మండల పరిధిలోని జడ్పీ హైస్కూల్, మద్దుల్వాయి పాఠశాలను డీఈవో రమేశ్ విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు చేపడుతున్న నేషనల్ ఆచీవ్‌మెంట్ సర్వేను ఆయన పరిశీలించారు. డీఈ వో వెంట సెక్టోరియల్ అధికారి సుభాశ్, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఓంకార్, మల్లారెడ్డి పాల్గొన్నారు.
పాపన్నపేటలో..
విద్యార్థుల సామర్థ్యాలను ఉపాధ్యాయుల నైపుణ్యాలను తెలుసుకునేందుకు జాతీయ సాధన సర్వే పరీక్ష(నాస్) నిర్వహిస్తున్నామని మండల విద్యాధికారి నర్సింహులు అన్నారు. పాపన్నపేటలోని శ్రీ విద్య పాఠశాలతో పాటు కుర్తివాడ , కొడుపాక, కొత్తపల్లి, అబ్లాపూర్, పొడ్చన్‌పల్లి, ఎల్లాపూర్ పాఠశాలలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 240 మంది పాల్గొన్నట్లు ఆయన వెల్లడించారు.