రామాయంపేట, ఏప్రిల్ 14: జంతువులు, మూగజీవాల రక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. రామాయంపేట మండలంలోని అక్కన్నపేట, తొనిగండ్ల, కాట్రియాల, దంతెపల్లి, లక్ష్మాపూర్, ఝాన్సీ లింగా పూర్, గిరిజన తండా, పర్వ తాపూర్, సదాశివనగర్, సుతారిపల్లి, డి.ధర్మారం, శివ్వాయపల్లి, రాయి లాపూర్, ఆర్.వెంకటాపూర్ తదితర గిరిజన తండా లకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలోని జంతువుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా అడవిలోనే చెట్ల మధ్యలో సాసర్ ఫిట్లను నిర్మించి దప్పిక తీరుస్తున్నారు. ఎండలు మండి పోతున్నాయి. మనుషులు రోడ్లపై నడవాలంటేనే జంకుతున్నారు. పశువులు అడవిలో ఉండే జంతువులు మండుతున్న ఎండలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇది గుర్తించిన ప్రభుత్వం గతేఏ డాది నుంచి అడవిలో జంతువుల రక్షణకు, వాటి దప్పిక తీర్చడం కోసం సాసర్ ఫిట్లు నిర్మించింది. అప్పటి నుంచి నేటి వరకు అటవీ సిబ్బంది ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో అడవిలోకి వెళ్లి జంతువుల కోసం నిర్మించిన సాసర్ ఫిట్లలో నీటిని నింపుతున్నారు. ఇందుకు ఉపాధి కూలీలు, సిబ్బంది ట్రాక్టర్ల ద్వారా రోజుకు రెండుసార్లు నీటిని నింపుతున్నారు. ఉదయం నింపిన నీళ్లు మళ్లీ సాయంత్రం అడవిలోకి పోయే వరకు తాగుతూ అడవి జంతువులు వెళ్లి పోతున్నాయి.
సాసర్ ఫీట్ల ఏర్పాటు
బీట్ పరిధిలోని సాసర్ ఫిట్లలో మూగజీవాలకు నీటితో బాటు అడవిలో ఉన్న మొక్కలకు వాటర్ ట్యాంకర్‌తో నీళ్లు పడుతు న్నారు. బీట్ అధికారితో పాటు ఉపాధి కూలీలు ఈ పనులు చేస్తున్నారు. ప్రతిరోజు మూగజీవాలు దాహంతో అల్లాడి పోకుండా అటవీ శాఖలో ఏర్పాటు చేసిన సాసర్ ఫిట్లలో నీళ్లు పట్టిస్తున్నారు. అడవిలో నాటిన మొక్కలకు కూలీల ద్వారా ప్రతిరోజు నీళ్లు పోసి సంరక్షిస్తున్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటు
అడవిని కాపాడడమే లక్ష్యంగా, పొడ వాటి చెట్లకు సీసీ కెమెరాలు పెట్టి జంతువుల ఆనవాళ్లను గుర్తిస్తున్నారు. సాసర్ ఫిట్ల దగ్గర ఎక్కడ ఎలాంటి జంతువుల కదలికలు వచ్చినా వెంటనే రామా యంపేట అటవీ శాఖ కార్యా లయంలో సైరన్ మోగుతుంది. దీంతో సీసీ కెమెరాల వద్ద ఉన్న సిబ్బంది అడవి జంతువు ఏ ప్రాంతానికి చేరుకున్నది సునాయాసంగా గుర్తుపడుతున్నారు. సైరన్‌తోనే వెంటనే అలర్టు అవుతూ అక్కడి ప్రాంతాల్లో కూలీలను సైతం పలానా ప్రాంతానికి వెళ్ల వద్దంటూ సూచనలు చేస్తు కూలీలతో పనులు చేయిస్తున్నారు. అటవీ శాఖలోనే చెక్‌డ్యాంలను నిర్మించి వాటిలోంచి సోలార్ ద్వారా పంపు సెట్లకు కనెక్షన్ ఇచ్చి చెక్ డ్యాంల నుంచి ట్యాం కర్లకు నీటిని అందిస్తూ సాసర్ ఫిట్లలో నీళ్లు నింపుతున్నారు. సోలార్ పోల్‌కు సీసీ కెమెరాలను అటవీ శాఖ బిగించి ఎప్పటిక ప్పుడు సమాచారం చేరవేస్తుంది.
అడవిని కాపాడటమే లక్ష్యం
రామాయంపేట మండలంలోని ఉన్న అటవి సంపద అన్యాక్రాంతం కాకుండా కాపాడుతాం. అటవీ శాఖ విస్తీర్ణం 500 హెక్టార్లలో ఉంది. ప్రతి రోజు బీట్ అధికారులతో అడవిలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాకుం డా చర్యలు చేపడుతున్నాం. అడవిలో ఉన్న చెట్లకు ప్రతిరోజు ట్రాక్టర్లతో నీళ్లు పోయిస్తున్నాం. రామాయంపేట అటవీ శాఖలో తిరిగే జంతువులను ప్రతి రోజు సీసీ కెమెరాల్లో చూస్తూ, వాటిని బంధించిన ఫొటోలను సంబంధిత అధికారులకు చేరవేస్తున్నాం. – విద్యాసాగర్, ఎఫ్ఆర్వో, రామాయంపేట
ప్రజలు అడవిలోకి వెళ్లకుండా చర్యలు
కలప కోసం ఆయా గ్రామాల ప్రజలు వెళ్లకుండా చర్యలు చేపడుతున్నాం. అడవి చుట్టూరా జేసీబీలతో గుంతలు తీయించి ఎవరూ వెళ్లకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నాం. అక్కన్నపేటలో నర్సరీ ఏర్పాటు చేసి, వాటిలో పండ్లు, ఇతర మొక్కలు పెంచుతున్నాం. అధికారులు ఎప్పటికప్పుడు ఫారెస్టులోని అణు వణువు పరిశీలిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అడవులపై పటిష్టమైన చర్యలు చేపట్టడంతో అటవీ శాఖ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – కుత్బుద్దీన్, డిప్యూటీ ఎఫ్ఆర్వో, రామాయంపేట