
టీఆర్ఎస్ చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన
మెదక్ ఎమెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 8 : టీఆర్ఎస్లో యువతకు పెద్దపీట వేస్తామని, యువత భవిష్యత్‌పై పార్టీ భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం చెన్నాయిపల్లికి చెందిన 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం మెదక్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మరో 20 ఏండ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడి గూటికి చేరుతున్నయన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. టీఆర్ఎస్లో చేరినవారు రమేశ్, రాజు, భాస్కర్, శ్రీకాంత్, స్వామి, కిష్టయ్య, పెంటయ్య, మల్లేశం, భిక్షపతి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో చిన్నశంకరంపేట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పట్లోళ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
చెర్యాల వార్డు మెంబర్ టీఆర్ఎస్లో చేరిక
సదాశివపేట, సెప్టెంబర్ 8 : మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సమక్షంలో కంది మండలం చెర్యాల గ్రామ కాంగ్రెస్ వార్డు మెంబర్ అనూషాబీరయ్యయాదవ్ టీఆర్ఎస్లో చేరారు. బుధవారం సదాశివపేట పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వార్డు మెంబర్‌కు మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు. ఇటీవల దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని, ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. కార్యక్రమంలో కంది మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పద్మావతి, చెర్యాల సర్పంచ్ శ్రావణ్‌కుమార్, ఉపసర్పంచ్ చంద్రారెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మల్లేశం, సీనియర్ నాయకుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.