Salim Khan: హాస్పిటల్లో సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్
Salim Khan: సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన వయసు 90 ఏళ్లు. బాంద్రాలో ఉన్న లీలావతి ఆస్పత్రిని సల్మాన్ ఇవాళ విజిట్ చేశారు.
ముంబై: ప్రముఖ సినీ రచయిత, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్(Salim Khan) ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన వయసు 90 ఏళ్లు. బాంద్రాలో ఉన్న లీలావతి ఆస్పత్రిని సల్మాన్ ఇవాళ విజిట్ చేశారు. ఇవాళ ఉదయం సలీమ్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో ఆయనకు చికిత్స చేస్తున్నారు. సలీమ్ ఖాన్ కుమార్తె అల్విరా ఖాన్, అల్లుడు అతుల్ అగ్నిహోత్రి, మనువడు అయాన్ అగ్నిహోత్రి కూడా ఆస్పత్రికి వెళ్లారు. సలీమ్ ఖాన్ దత్త పుత్రిక అర్పితా ఖాన్, ఆమె భర్త ఆయుష్ శర్మ కూడా ఆస్పత్రి విజిట్ చేశారు.
ఎన్నో బాలీవుడ్ మేటి చిత్రాలకు సలీమ్ ఖాన్ .. డైలాగ్‌లు రాశారు. జావెద్ అక్తర్‌తో కలిసి షోలో, హాతీ మేరా సాథీ, జంజీర్, మిస్టర్ ఇండియా లాంటి చిత్రాలకు సలీమ్ ఖాన్ స్క్రిప్ట్ ఇచ్చారు. 2025 నవంబర్ 24వ తేదీన ఆయన 90వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. గత ఏడాది సలీమ్ ఖాన్ చిన్న కుమారుడు , ప్రొడ్యూసర్ సోహెల్ ఖాన్ తమ పేరెంట్స్‌కు చెందిన పిక్‌ను పోస్టు చేశారు. ఇన్‌స్టాలో ఆ ఫోటో వైరల్ అయ్యింది. 90వ బర్త్‌డేకు ముందు సలీమ్ ఖాన్, ఆయన తొలి భార్య సల్మా ఖాన్.. 61వ వివాహా వార్సికోత్సవాన్ని నిర్వహించారు. మిత్రులు, శ్రేయోభిలాషులతో కలిసి ఆ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
1960లో సలీమ్ ఖాన్ తన కెరీర్‌ను స్టార్ట్ చేశారు. తీస్రీ మంజిల్, సర్హదీ లూటేరా చిత్రాల్లో ఆయన నటించారు. సినిమాల కోసం ప్రిన్స్ సలీమ్ అని ఆయన పేరు పెట్టుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

