అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యే తల్లి ఇంట్లో భారీ చోరీ ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ( MLA Dulipalla Narendra ) తల్లి ప్రమీలాదేవి ఉంటున్న చింతలపూడిలో ఇంట్లో దొంగలు చొరబడ్డారు. 43 సవర్ల బంగారం, 10 కేజీల వెండిని, రూ.లక్ష నగదును దోచుకెళ్లారు. ప్రమీలాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించి క్లూస్ టీంను రప్పించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.