చేర్యాల, జూన్ 30: పేదల కుటుంబాల్లో మనోచేతన దివ్యాంగుల సంస్ధ వెలుగులు నింపుతున్నదని మనోచేతన ఫౌండర్ చుక్క వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణంలోని వావిలవంపులోని మనోచేతన దివ్యాంగులు సంస్ధలో మనో చేతన టీచర్ ట్రైనింగ్ స్పెషల్ నీడ్స్ కళాశాలలో శిక్షణ పొందిన అభ్యర్ధులు డీఎస్సీ 2024లో ప్రతిభ కనబరిచి 18 మంది ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందారు. సోమవారం మనోచేతన సంస్థలో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగాలు పొందిన 18 మందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, ఉపాధ్యాయులు ఎప్పుడు నైపుణ్యం పెంచుకోవాలని, సమాజంలో స్పెషల్ ఎడ్యుకేషన్ రంగంలో తనదైన ముద్ర వేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మనోచేతన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.