సిద్దిపేట : సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ నెల 16,17 తేదీల్లో వైద్య విద్య పట్ల ప్రజలు, విద్యార్థుల్లో అవగాహన కోసం వైద్య విద్య ప్రదర్శన నిర్వహిస్తున్నాం. దీని ద్వారా వైద్యంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు, వ్యాధుల నిర్మూలన గురించి అవగాహన కల్పించనున్నట్లు సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులు సత్య చరణ్, సాత్విక్, తాజుద్దీన్ పేర్కొన్నారు.
బుధవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న మెడికల్ ఎగ్జిబిషన్లో మానవ శరీరంలోని ముఖ్యమైన అవయవాలు, వాటి విధులు, మానవ అవయవ వ్యవస్థ నిర్మితులు మొదలగు అంశాలలో అవగాహన కల్పిస్తామన్నారు.
మొట్ట మొదటిసారిగా సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో దీనిని నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రదర్శన వైద్య కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించ బడుతుందన్నారు. కావున పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వైద్య విద్య ప్రదర్శనను తిలకించి, విజయ వంతం చేయాలని వారు కోరారు.