ములుగు, జూన్ 11: యువత విధి నిర్వహణలో నాణ్యమైన సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, విద్యార్థులు ఉన్నత లక్ష్యంతోపాటు పనిలో నాణ్యతను చూపితే విజయం మీ దాసోహం అవుతుందని రాష్ట్ర గవర్నర్, ఉద్యాన వర్సిటీ చాన్స్‌లర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. మంగళవా రం సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగా ణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవాన్ని ములుగులో ని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. స్నాతకోత్సవంలో భాగంగా 156 అండర్ గ్రాడ్యువేషన్, 45 పోస్ట్ గ్రాడ్యువేషన్, 6 పీహెచ్డీ విద్యార్ధులలతోపాటు వర్సిటీ అనుబంధ కళాశాల అయిన అటవీ కళాశాలకు చెందిన 50 అండర్ గ్రాడ్యువేషన్ 30 పోస్ట్ గ్రాడ్యువేషన్ విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు.కార్యక్రమానికి గవర్నర్ రాధాకృష్ణన్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా వీసీ డాక్టర్ నీరజాప్రభాకర్, వర్సిటీ అధికారులు ఆయనకు పుష్ఫగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికారు.
మొదట వాయిద్యాలతో జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం సభా వేదికపై గవర్నర్ రాధాకృష్ణన్ ప్రసంగించారు. విద్యార్థులు విజయమే ధ్యేయం గా ముందుకు సాగాలని, కష్టాలు ఎదురైతే విరామం తీసుకోవచ్చు కానీ, లక్ష్యం సాధించేవరకు వెనుతిరుగొద్దని విద్యార్థులకు సూచించారు. ఉజ్వల భవిష్యత్తు కోసం గొప్ప లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల స్థూల జాతీయోత్పత్తికి ఎదిగేందుకు భారత్‌కు పుష్కల అవకాశాలు ఉన్నాయని అందుకు యువత ప్రముఖ పాత్ర పోషించాలని అన్నారు. భారత జాతీయ స్థూల జాయోత్పత్తికి 18శాతానికి మించి వ్యవసాయమే ఆధారమైన నేపథ్యంలో మరింత వృద్ధిరేటుకు ప్రభుత్వం సహజ, సేంద్రియ వ్యవసాయానికి మరింత మద్దతునిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో వ్యవసాయ రం గంతోపాటు ఉద్యాన, అటవీ రంగాలకు ప్రాధాన్యత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణులకు ప్రధాన ఆదా య వనరు వ్యవసాయమేనని పేర్కొన్నారు. తరుగుతున్న సాగు నేల, సహజ వనరులు, పంటల ఉత్పాదకత, పర్యావరణ మార్పుల నేపథ్యంలో సుస్థిర భద్రత సాధించడంతో పాటు సూపర్ ఎకానమిక్ పవర్‌గా భారత్ ఎదిగేందుకు టెక్నాలజీ ఆధారిత వ్యవసా యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యార్థులకు పతకాలు ప్రదానం
స్నాతకోత్సవంలో భాగంగా విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేసిన అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గవర్నర్ రాధాకృష్ణన్ చేతుల మీదుగా బంగారు పతకాలను అందజేశారు. బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చినందకు 2023 బ్యాచ్‌కు చెందిన వరలక్ష్మి మూడు బంగారు పతకాలు అందుకున్నా రు. బీఎస్సీ హానర్స్ ఫారెస్ట్రీలో పీసీసీ ఎప్ గోల్డ్ మెడల్‌ను రవళి, డీన్స్ గోల్డ్ మెడల్ ప్రత్యూష అందుకున్నారు. ఎమ్మెస్సీ హార్టికల్చర్‌లో అన్ని విభాగాల్లో అత్యధిక మా ర్కులు సాధించినందుకు మాళవిక మూడు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. వీరితోపాటు పండ్లశాస్త్ర విభాగంలో విద్య శ్రీ, ఔషధ, సుగంధ ద్రవ్య విభాగంలో మహేశ్వరి బంగారు పతకాలను అందుకున్నారు. కార్యక్రమంలో తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ గీతాలక్ష్మి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, రిజిస్ట్రార్ భగవాన్, డీన్ రాజశేఖర్, పరిశోధన సంచాలకులు కిరణ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీనివాసన్, ఉద్యానశాఖ కమిషనర్ అశోక్‌రెడ్డి, బోర్డుమెంబర్ ఆర్కే మా థూర్, వర్సిటీ అధికారులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉన్నత లక్ష్యం దిశగా కార్యాచరణ ; వీసీ నీరజాప్రభాకర్
ఉద్యాన మానవ వనరులుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అవసరమైన శిక్షణ అం దించడతోపాటు క్షేత్రస్థాయిలో రైతులకు సాంకేతిక సహకారాన్ని అందించి వెన్నుదన్నుగా నిలిచేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించి వాటిని అమలుపరుస్తున్నామని ఉద్యాన వర్సిటీ వీసీ నీరజా ప్రభాకర్ అన్నారు. స్నాతకోత్సవంలో ఆమె మాట్లాడుతూ…తెలంగాణలో రైతు లు సాగు చేస్తున్న బాలనగర్ సీతాఫలం, ఆర్మూర్ పసుపుతోపాటు మరికొన్ని స్థానిక పంటలకు భౌగోళిక గుర్తింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. రైతులకు శాస్త్రీయతతో కూడిన ఉద్యాన దర్శినితో ప్రచురణతోపాటు గ్రామాల దత్తత, విస్తరణ కార్యక్రమాల ద్వారా రైతులకు ఉద్యా న పరిజ్ఞానాన్నిఅందజేస్తున్నట్లు తెలిపారు.