Drugs | రాయపోల్ అక్టోబర్ 27 : రాయపోల్ మండల కేంద్రంలోని పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో సోమవారం డ్రగ్స్ ఫ్రీ ఇండియా కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. రాయపోల్ ఏపీఎం యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథులుగా ఎంఈఓ సత్య నారాయణ రెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ షబానా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రగ్స్ అనే మహమ్మారి యువతను చెడు దారి పట్టిస్తుందన్నారు. డ్రగ్స్ అనేది ఒకప్పుడు పట్టణ ప్రాంతాలలో ఉండేది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో విపరీతంగా పెరిగిందన్నారు. భారత ప్రభుత్వం నాషా ముక్త్ భారత్ అభియాన్ ద్వారా మాదకద్రవ్య రహిత భారతదేశం కోసం పనిచేస్తుందన్నారు.
ఇది నివారణ చికిత్స, పునరావాసం, సమగ్ర విధానం ద్వారా మాదకద్రవ్యం వినియోగాన్ని పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. తమ పిల్లలు చెడు అలవాట్లకు దూరంగా ఉండే విధంగా సంఘ సభ్యులకు సూచించారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతిభ కనబరిచిన ముగ్గురిని ఎంపిక చేయడం జరిగింది అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపిఎం యాదగిరి,మండల సమైక్య అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి సౌందర్య,సీసీలు నాగరాజు.
కుమారస్వామి, రోజా, అంజమ్మ,అకౌంటెంట్ ఆపరేటర్ రేఖ, వివోఏలు నర్సింలు, సుభద్ర,భాను,విజయ, అంగన్వాడి టీచర్ రేఖ, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
