సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 5: మహిళా శక్తి లబ్ధిదారుల యూనిట్ల గ్రౌండింగ్‌ను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సం బంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవా రం కలెక్టరేట్లో గ్రామీణ మహిళా శక్తి కార్యక్రమంలో మాట్లాడారు. మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలని, మహిళా సాధికారత ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్న ట్లు తెలిపారు. జిల్లాలోని ఆయా బ్యాంకుల ద్వారా మహిళా శక్తి యూనిట్ల ఎంపిక సక్రమంగా జరగాలన్నారు. మొత్తం 13 రకాల యూనిట్ల ద్వారా మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జ్యోతి, అదనపు డీఆర్డీవో జంగారెడ్డి, డీపీఎంలు, సీపీఎంలు ఇతర శాఖల జిల్లా అధికారులు, జిల్లా, మండల సమాఖ్య అధ్యక్షులు పాల్గొన్నారు.
జిల్లా ప్రత్యేకాధికారిగా కలెక్టర్
జడ్పీ పాలకవర్గాలకు గురువారంతో గడువు ముగిసింది. దీంతో కలెక్టర్‌కు జడ్పీ ప్రత్యేకాధికారిగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. శుక్రవారం జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు.