Farooq Rukh Hussain | పేదలకు దుస్తులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ రుఖ్ హుస్సేన్
పేద ప్రజలకు తోచిన విధంగా సహాయం చేస్తేనే ఎల్లప్పుడూ జీవితంలో గుర్తు ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ షారుఖ్ రుఖ్ హుస్సేన్ అన్నారు.
రాయపోల్. అక్టోబర్ 1 : పేద ప్రజలకు తోచిన విధంగా సహాయం చేస్తేనే ఎల్లప్పుడూ జీవితంలో గుర్తు ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ షారుఖ్ రుఖ్ హుస్సేన్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని తిమ్మక్కపల్లి గ్రామంలో మాజీ జడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి తో కలిసి పలువురికి దసరా పండుగ సందర్భంగా నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండుగకు ముస్లిం సోదరులకు బట్టలను నిత్యావసర సరుకులను అందజేశామన్నారు. దసరా పండుగ సందర్భంగా హిందువులకు బట్టలను అందజేయడం ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు.
తాను ఓట్ల కోసం రాలేదని, పార్టీలకు అతీతంగా నిరుపేదలకు సహాయం అందించేందుకు ముందు వరుసలో ఉన్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పేదలకు, వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిన ఘనత కెసిఆర్ కి దక్కుతుందని తెలిపారు. పదవులు వస్తాయి.. పోతాయని.. పేద ప్రజలకు సేవలు చేయడం తాను ఎప్పుడు మరువనని స్పష్టం చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ఇప్ప దయాకర్, మండల నాయకులు రాజిరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, చింతకింది మంజూరు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

