Mahua Moitra | టీఎంసీ మహువా మొయిత్రాకు అరెస్ట్ వారెంట్ జారీ.. విచారణకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం
Mahua Moitra : టీఎంసీ పార్టీ ఎంపీ మహువా మొయిత్రాకు పశ్చిమ బెంగాల్లోని కోర్టు షాకిచ్చింది. విద్వేష ప్రసంగంపై దాఖలైన కేసులో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సమన్లు జారీ చేసినప్పటికీ హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు బుధవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Mahua Moitra : టీఎంసీ పార్టీ ఎంపీ మహువా మొయిత్రాకు పశ్చిమ బెంగాల్లోని కోర్టు షాకిచ్చింది. విద్వేష ప్రసంగంపై దాఖలైన కేసులో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సమన్లు జారీ చేసినప్పటికీ హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు బుధవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ జిల్లా కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. తులసి మాలలపై మత విశ్వాసాలు దెబ్బతీసేలా మహువా మొయిత్రా వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై కేసు నమోదైంది.
ఇదే సమయంలో ఇండియన్ ఆర్మీపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై కేసు దాఖలైంది. ఈ కేసు విచారణ కోసం ఆమె కోర్టులో స్వయంగా విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం పలుమార్లు ఆమెకు కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే, అనేకసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె కోర్టుకు రాలేదు. బుధవారం కూడా విచారణకు రావాల్సి ఉంది. దీనిపై మంగళవారమే ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ ఈ రోజు కూడా ఆమె విచారణకు హాజరుకాలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణానగర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కింద ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు కోర్టు స్పష్టం చేసింది. మహువా మొయత్రా కోర్టుకు హాజరు కారని ఆమె తరఫు న్యాయవాది కూడా కోర్టుకు త తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి.. ఆమె వైఖరి కోర్టులపై ఎలాంటి గౌరవం లేదనే విషయాన్ని సూచిస్తుందని వ్యాఖ్యానించారు.
దీంతో తప్పనిసరిగా అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు మహువా మొయిత్రా ఇదే అంశంపై సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. తాను ఆగష్టు 15న విచారణకు హాజరుకావాలంటూ గతంలో స్తానిక కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కానీ, ఈ పిటిషన్ విచారణకు కోర్టు అంగీకరించలేదు. దీంతో ఆమె తరఫు లాయర్లు తమ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

