హుస్నాబాద్ టౌన్, అక్టోబర్ 15: వరి కోతలు ప్రారంభమైనప్పటికీ గ్రామాల్లో ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నా రు. హుస్నాబాద్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతులను రాజులను చేస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం వారికిచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. వరికి బోనస్ ఇస్తామని చెప్పి నేడు కొర్రీలు పెట్టడం తగదన్నారు. అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నప్పటికీ రైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వడం లేదని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంతరెడ్డి ఇచ్చిన మాటను ఎం దుకు నిలబెట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. తక్షణమే పూర్తిస్థాయి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుభరోసా చెల్లించాలని, రుణమాఫీ పూర్తిచేయాలని మంత్రిని, కాంగ్రెస్ నాయకులను రైతు లు నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతులు అధైర్యపడవద్దని, తాము అండగా ఉంటామని, వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని సతీశ్‌కుమార్ డిమాండ్ చేశారు.